సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. భారత ఆర్మీ కెప్టెన్, ముగ్గురు జవాన్ల వీరమరణం 

పాకిస్థాన్ మరోసారి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది. జమ్మూలోని రాజౌరి జిల్లాలో గల సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు హఠాత్తుగా కాల్పులకు పాల్పడ్డారు. వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో భారత ఆర్మీ కెప్టెన్ కపిల్ కుందుతో పాటు ముగ్గురు సైనికులు రోషన్ లాల్, రామ్ అవతార్ మరియు శుభం సింగ్ వీరమరణం పొందారు. 
23 ఏళ్ల వయసు గల కెప్టెన్ కపిల్ కుందు స్వస్థలం హర్యానాలోని ఒక మారుమూల ప్రాంతం. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!