10,000 మంది దళితుల తిరుమల యాత్ర.. గోవిందనామస్మరణతో మార్మోగుతున్న తిరుమల.. పరవశిస్తున్న భక్తజనం 

స్వామీ కమలానంద భారతి ఆధ్వర్యంలో పదివేలకు మంది పైగా గిరిజన, హరిజన, గ్రామీణ భక్తులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు చేరుకుంటున్నారు. అలిపిరి నుండి నడకదారి ద్వారా వారి పాదయాత్రగా సాగుతోంది. ఆ ప్రాంతమంతా భక్తుల గోవిందనామస్మరణతో మార్మోగిపోతోంది. 
 
హిందూ ధర్మంలోని గ్రామీణ, వెనుకబడిన వర్గాల వారిని దేవాలయాలకు చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా స్వామీ కమలానంద భారతి చేపట్టిన సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన యాత్రలో భాగంగా ఈ తిరుమల యాత్ర జరుగుతోంది. యాత్రలో దారి పొడవునా భక్తులు కాషాయ జెండాలు చేతబట్టి, అన్నమయ్య సంకీర్తనలు పాడుకుంటూ కనిపించడంతో ఇతర భక్తులు పరవశించిపోతున్నారు. అలిపిరి ప్రాంతంలో భక్తులంతా కలిసి స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. మరికాసేపట్లో వారు స్వామివారిని దర్శించుకోనున్నారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!