బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగుకి గురైంది. ఆ అకౌంట్ తామే హ్యాక్ చేసినట్టు టర్కిష్ సైబర్ ఆర్మీ పేరిట ఒక ట్వీట్ అందులో ఉంచబడింది. అకౌంట్లోని ముఖ్యమైన సమాచారం, ఇతర సందేశాలు దొంగలిస్తున్నట్టుగా హ్యాకర్లు ఆ ట్వీట్లో ప్రకటించారు. చివరిలో ఐ లవ్ పాకిస్తాన్ అనే సందేశం ఉంచారు. అనంతరం ట్విట్టర్ హ్యాండిల్ యూసర్ నేమ్ మరియు ప్రొఫైల్ ఫొటోలు మార్చివేశారు. 
 
 
 
ఇది జరిగిన కొద్ది నిమిషాలకే ఆ ట్విట్టర్ హ్యాండిల్ డిలీట్ చేయబడింది.   

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!