భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టు కదలికలు.. హై అలెర్ట్ 

గతకొంతకాలంగా  ప్రశాంతంగా ఉన్న భద్రాచలం ఏజెన్సీలో మళ్ళీ మావోయిస్టుల అలజడి మొదలైంది. వారం రోజుల క్రితం ఇంఫార్మర్ నెపంతో మావోయిస్టులు పినపాక మండలంలో ఇద్దరిని హత్యచేశారు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం గ్రామంలో సెల్ టవర్లు పేల్చివేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, మంగపేట మండలాల్లో కూడా ఏవైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశాలున్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాహనాలు, అనుమానితులను సోదా చేస్తున్నారు. మావోయిస్టులకు టార్గెట్లుగా భావిస్తున్న వ్యక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు సమాచారం. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!