హైకోర్టుని ఆశ్రయించిన తిరుమల హైందవేతర ఉద్యోగులు – టిటిడికి నోటీసులు 

ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 44 మంది హైందవేతర ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు ఆ 44 మంది ఉద్యోగులు తమకు షోకాజ్ నోటీసులు జారీచేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు టీటీడీకి నోటీసులు జారీచేసింది. 
 
ఈ విషయమై టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ 1989, 2007 సంవత్సరాల్లో జారీ అయిన జీవోల ప్రకారం హైందవేతరులను టీటీడీ విధుల్లోకి తీసుకోవడం కుదరదు అని, ఈ నియమ నిబంధనలు అనుసరించే తాము గుర్తించిన 44 మంది హైందవేతరులకు నోటీసులు పంపామని, వారిని టిటిడికి సంబంధం లేని ఇతర ప్రభుత్వ శాఖలకు పంపే ప్రతిపాదన ఉందని తెలిపారు. 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!