1984 సిక్కుల ఊచకోత వ్యవహారం: స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయిన కాంగ్రెస్ నేత 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1984 సిక్కుల ఊచకోత ఘటనకు సంబంధించి కేసులోని ప్రధాన నిందితుడు, కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయినట్టు తెలుస్తోంది.  తాము చేపట్టిన ఈ రహస్య స్టింగ్ ఆపరేషన్లో జగదీశ్ టైట్లర్ 1984 ఘటనలో తన ప్రమేయం, పార్టీ ప్రమేయాన్ని అంగీకరించినట్టు పంజాబ్ కు చెందిన శిరోమణి అకాలీ దళ్ వెల్లడించింది. దీనికి సంబంధించిన సీడీని సీబీఐకి సమర్పించినట్టు అకాలీ దళ్ నేత మంజిత్ సింగ్ తెలిపారు. 
 
1984లో సిక్కు మతస్థులపై కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మారణహోమానికి సంబంధించి కేసు పునర్విచారణ జరిపేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన బెంచ్  ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో ఇదే ఘటనకు చెందిన 241 కేసులను అప్పటి విచారణ బృందం కొట్టివేసింది. అందులో 186 కేసులను కనీసం విచారణ కూడా చేయలేదు. 
 
ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా సిక్కులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 3000 మందికి పైగా సిక్కు మతస్థులను హత్య చేశారు. వారిలో అనేక మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!