‘ఆర్మీపై ఎఫ్.ఐ.ఆర్’ వ్యవహారంలో కలుగజేసుకోవాల్సిందిగా రాష్ట్రపతికి సుబ్రహ్మణ్యన్ స్వామి అభ్యర్ధన

జమ్మూ కాశ్మీర్లో ఆర్మీపై రాష్ట్ర పోలీసులు  ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన ఘటనపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నుండి వివరణ తీసుకోవాల్సిందిగా  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి రాష్ట్రపతిని కోరారు.  ఎఫ్.ఐ.ఆర్ నమోదుకు ముందు తాము నిర్మలా సీతారామన్ తో చర్చించామని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తెలపడంతో  ఎఫ్.ఐ.ఆర్ నమోదుకు రక్షణమంత్రి అంగీకారం తెలిపారా లేదా అనేది తెలుసుకోవాలని రాష్ట్రపతిని స్వామి కోరారు. 
 
సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏ.ఎఫ్.ఎస్.పి.ఏ)లోని సెక్షన్ 7 ప్రకారం ఆర్మీపై  ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలంటే భారత ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందే. ఈ విషయంలో గత 10 రోజుల నుండి దేశవ్యాప్త చర్చ జరుగుతున్నా కేంద్ర రక్షణ మంత్రి నుండి ఎలాంటి స్పందనా లేదు. ఇదే విషయమై రాజ్యసభలో చర్చించేందుకు గతవారం సుబ్రహ్మణ్యన్ స్వామి సావధాన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 
 
ఈ విషయమై స్వామి మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని సెక్షన్ 78(సి) ప్రకారం ఏదైనా సున్నితమైన, ప్రజోపయోగ సమస్య గురించి రాష్ట్రపతి ప్రధానమంత్రి, ఇతర మంత్రుల నుండి వివరణ కొరవచ్చునని, దీని ఆధారంగానే ఎఫ్.ఐ.ఆర్ వ్యవహారంలో వివరణ తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరినట్టు సుబ్రహ్మణ్యన్ స్వామి తెలిపారు. 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!