గౌతంనగర్ నుంచి ఇస్లాంనగర్ – గ్రామం పేరు మార్చే కుట్ర.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దళితులు

 
ఉత్తరప్రదేశ్లో అమ్రోహా జిల్లాలోని గౌతంనగర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితులు ఎక్కువగా నివసించే ఈ గ్రామం క్రమక్రమంగా ఇస్లామీకరణకు గురవుతోందంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒక వర్గానికి చెందిన వారు తమవారిని బలవంతంగా మతం మార్చేందుకు కుట్ర చేస్తున్నారని, ఇప్పటికే  గ్రామానికి ఇస్లాంనగర్ గా పేరు మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మొత్తం 12 లక్షల జనాభా గల ఈ జిల్లాలో 42 శాతం మంది ముస్లిములు ఉన్నారు. గౌతంనగర్ పూర్తిగా దళితులు నివసించే గ్రామం. సుమారు 1500 మంది గ్రామస్థులు ఇస్లామిక్ మతమార్పిడికి గురయ్యే ప్రమాదంలో ఉన్నట్టు ఓపిడియా కధనం పేర్కొంటోంది.  అక్కడ ఉన్న సుమారు 50 దుకాణాలలో ఇప్పటికే 20-25 దుకాణాలపై గౌతంనగర్ పేరు తీసివేసి ఇస్లాంనగర్ అని పెయింట్ వేశారు. 
 
ఈ ఘటనపై స్థానిక మురారి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రామం పేరు మార్చినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఇస్లాంనగర్ అని రాసిన బోర్డులు తొలగించారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!