ట్విట్టర్ వేదికగా.. రాజ్దీప్ సర్దేశాయ్ మీద విరుచుకుపడుతున్న ఐపీపటేల్ 

కాలం ఎప్పుడూ అనుకూలంగా ఉండదు.. ఈ విషయం జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కి అర్ధమయ్యేలా చేస్తున్నారు యువ న్యాయవాది, 21 ఆప్ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వం రద్దుకు కారణం అయిన ప్రశాంత్ ఉమారావ్ అలియాస్ ఐపీపటేల్.  
 
జాతీయ రాజకీయాల పట్ల అవగాహనకు రాజ్దీప్ సర్దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. కల్పిత కధనాలు వండివార్చడంలో దిట్ట అతడు. 
తాజాగా వీరిద్దరికీ  మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న యుద్ధంలో ఐపీ పటేల్ చేస్తున్న ఆరోపణలకు రాజ్దీప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. 
 
వీటిలో ప్రధానమైనవి.. 

రాజ్దీప్ సర్దేశాయ్ తన కొడుకు మెడికల్ సీటు కోసం జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని గోవా, మంగుళూరులోని మెడికల్ కాలేజీలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అత్తెసరు మార్కులతో పాసైన అతడి కొడుక్కి సీటు ఇవ్వడానికి ఏ కళాశాల ముందుకు రాకపోవడంతో ఆ సమయంలో తాను పనిచేస్తున్న CNN ఛానెల్లో 4 ఏప్రిల్ 2013 నుండి మెడికల్ సీట్ల అవినీతి పేరిట వరుస కధనాలు ప్రచురించడం మొదలుపెట్టాడు. అనంతరం 24 మే 2013లో అతడి కొడుక్కి NRI కోటాలో కోటి రూపాయల డొనేషన్ కట్టి సీటు సంపాదించాడు. 

అంతేకాకుండా రాజ్దీప్ భార్య సాగరికా ఘోష్ మీద కూడా గతంలో జరిగిన దాడిని కూడా ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక విదేశీ దౌత్యకారుడి భార్య సాగరికా ఘోష్ మీద దాడి చేసిన విషయాన్ని గూర్తుచేస్తూ ఆ దంపతులకు దెబ్బలు తినడం అలవాటే అని వ్యాఖ్యానించారు. 

ఇంతే కాకుండా రాజ్దీప్ సర్దేశాయి తండ్రిని కూడా వదల్లేదు ఐపీపటేల్. అతడి తండ్రి దిలీప్ సర్దేశాయ్ 1993లో విదేశీ కరెన్సీ మార్పిడికి సంబంధించి 6.89 మిలియన్ డాలర్ల అవినీతిలో ఫారిన్ ఎక్స్చేంజి రెగ్యులేషన్ యాక్ట్ కింద ముంబైలో అరెస్ట్ అయినట్టు తెలిపారు. 
ఈ అనూహ్య పరిణామాలకు దిక్కుతోచని రాజ్దీప్ చేసేదేమి లేక మిన్నకుండిపోయాడు. ఒకవేళ ఐపీపటేల్ ఆరోపణల్లో నిజం లేకపోతె రాజదీప్ ఇప్పటికే అతడిపై పరువునష్టం దావా వేసివుండాలి. కానీ ఆరోపణలకు కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. 

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!