హైదరాబాదులో మరో లవ్ జిహాద్ – ప్రేమ పేరిట మతమార్పిడి.. పెళ్లి అనగానే పరారైన యువకుడు

హైదరాబాదులో మరో లవ్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మల్కాజ్గిరి నూర్ ఖాన్ బజార్ ప్రాంతానికి చెందిన సఫ్దార్ అబ్బాస్ జైదీ అదే ఆనంద్ బాగ్ ప్రాంతానికి చెందిన పింకీ చంద గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈక్రమంలో ఆమెను ఉద్యోగం పేరిట దుబాయ్ తీసుకువెళ్లాడు. యిద్దరు కొంతకాలం అక్కడ గడిపిన తరువాత ఆ యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని నిబంధన విధించడంతో చేసేదేమీ అందుకు అంగీకరించింది. దుబాయిలో ఒక మసీదుకు తీసుకువెళ్లి మతపెద్దల సమక్షంలో ఇస్లాంలోకి మార్చాడు. తరువాత ఆమెను తన కుటుంబానికి పరిచయం చేసాడు. హిజాబ్ ధరించాలని, ఇస్లాం నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆంక్షలు విధించాడు. అన్నిటికీ ఆమె అంగీకరించింది. 
 
 
ఇద్దరికీ పెళ్లి నిశ్చయమైన సమయంలో అతడి అసలుస్వరూపం బయటపడింది. హిందూ అమ్మాయి కాబట్టి తమ కుటుంబంలో ఇమడటం కష్టం అని చెప్పడం మొదలుపెట్టాడు.
ఆ తరువాత పెళ్లి చేసుకోవడం కుదరదు అని, తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తననే పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన యువతి తన తల్లిదండ్రుల ద్వారా మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
 
 
 
తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. తన కూతురు లాగా  ఇంకెవ్వరు మోసపోకుండా చూడాలని, ఈ విషయంలో స్వామి పరిపూర్ణానంద చొరవ తీసుకుని సహాయం చేయాలని బాధితురాలి తల్లి  వేడుకుంటోంది. 
 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!