వీసా నిబంధనల ఉల్లంఘిస్తూ నెల్లూరు జిల్లాలో విదేశీయుల మతప్రచారం

నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా విదేశీ క్రైస్తవ ప్రచారకులు మతపరమైన సభల్లో పాల్గొంటూ మతప్రచారానికి పాల్పడుతున్నారు. అమెరికా నుండి వచ్చిన కెల్లీ లీగర్ మరియు ఇతర విదేశీయులు భారతీయ వీసా చట్టాలకు విరుద్ధంగా సువార్త పండుగలు కార్యక్రమంలో పాల్గొని మతప్రచారం చేయడంతో పాటు మతమార్పిళ్లలో పాలుపంచుకుంటున్నారు.
 
వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో స్థానిక మైదానంలో జరుగుతున్న విదేశీయుల మతప్రచార కార్యక్రమం  విషయాన్ని కొందరు ప్రజలు నెల్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటాం అని పోలీసులు హామీ ఇచ్చినట్టు సమాచారం. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!