ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రవాద సంస్థ: షియా వక్ఫ్ బోర్డు వెల్లడి

పాకిస్తాన్, సౌదీ అరేబియా దేశాల చేతిలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక కీలుబొమ్మగా మారింది అని షియా వక్ఫ్ బోర్డు ఆరోపించింది. సల్మాన్ హుస్సేన్ నద్విని పర్సనల్ లా బోర్డు పదవి నుండి తప్పించడంపై అభ్యతరం వ్యక్తం చేసింది. తీవ్రవాదులను తయారుచేసే జాకిర్ నాయక్ లాంటి వ్యక్తులు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులో మెంబర్లుగా ఉండగా లేనిది సల్మాన్ హుస్సేన్ నద్వి లాంటి వ్యక్తులు సభ్యులు అయితే తప్పేమిటి అని ప్రశ్నించింది.

బాబ్రీ వివాదాస్పద కట్టడాన్ని మసీదుగా పేర్కొంటూ, అది కలకాలం అలాగే ఉండిపోతుంది అని, మసీదు ఇస్లాంలో ఒక ముఖ్యమైన అంశం, దాన్ని అక్కడి నుండి తొలిగించాడన్ని ముస్లింలు ఒప్పుకోరు అని ఒక ప్రెస్ స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే సల్మాన్ హుస్సేన్ నద్వి తాను శ్రీ శ్రీ రవిశంకర్ సహాయంతో అయోధ్య సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తాను అని పేర్కొన్నారు

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!