భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న చర్చి: బయటపెట్టిన మార్క్సిస్ట్ నాయకుడు

త్రిపురలో వేర్పాటువాదాన్ని , ఉగ్రవాదాన్ని చర్చి ప్రోత్సహిస్తోందంటూ అక్కడి మార్క్సిస్ట్ నాయకుడు సంచలన విషయాలు తెలియజేశాడు. విదేశాలనుండి పెద్ద మొత్తంలో నగదును చర్చ్ తీవ్రవాద కార్యకలాపాల కోసం సమకూర్చుకుంది అని CPI (M) మాజీ ఎంపీ ఖేగెన్ దాస్ తెలియజేసారు. ఈయన జనవరి 21వ తేదీన కోల్కతాలో గుండె నొప్పితో మరణించారు.
1980 దశకం మొదటినుండీ త్రిపురలో క్రైస్తవ చర్చి వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది అని, గత 30 సంవత్సరాలుగా మిలిటెంట్లకు అది నిధులు సమకూరుస్తోంది అని తెలిపారు. చర్చిలో ఒక వర్గం ట్రైబల్ ఇన్సర్జన్సీని బాహాటంగానే సమర్ధిస్తోంది అని, త్రిపురలోనే కాకుండా మిగతా ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి కార్యకలాపాలకు చర్చి వర్గాలు పాల్పడుతున్నాయి అని అన్నారు. అంతే కాకుండా కిమ్ డేవి కోర్ట్ కు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా పేర్కొన్న వాంగ్మూలాన్ని కూడా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో విమానం ఆయుధాల పారా డ్రాపింగ్ కేసులో గతంలో కోర్టుకి కిమ్ డేవి వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ప్రకారం స్వయంగా చర్చి తన నిధులతో ఈశాన్య రాష్ట్రాలలో మిలిటెన్సీని ప్రోత్సహించింది అన్న నిజం విదితమవుతోంది అని తెలిపారు.

1995,1996లో కిమ్ డేవి , పీటర్ బ్లీచ్ మరియు వాళ్ల అనుచరులు త్రిపురలో తీవ్రవాద కార్యకలాపాల కోసం ఆయుధాలు సమకూర్చారని, వారికి ధన సహాయం చర్చి నుండి అందిందన్న విషయం వారే తెలిపారు అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు కొమ్ముకాసింది, ఇంకా వారిని ఎలా పెంచి పోషిస్తోంది అన్న విషయం ఈ మధ్య కాలంలో జరిగిన స్టింగ్ ఆపరేషన్స్ ద్వారా తేట తెల్లమైపోయాయి. అసలు మన భారత దేశంలో ఏం జరుగుతోంది అన్న విషయాలు బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటోందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న విదేశీ NGO నిధులు, విచ్చలవిడిగా జరుగుతున్న మతమార్పిడులు భారత దేశంలో కచ్చితంగ అంతర్గత యుద్ధం జరిగేలా చేస్తున్నాయి . ఇప్పటికన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సొంత లాభాలు పక్కన పెట్టి దేశ భద్రతను, ప్రయోజనాలను పట్టించుకోకుంటే రాబోయే సంవత్సరాలలో భారతదేశంలో మారణహోమం తప్పదు. ఈసారి జరగబోయే మారణహోమానికి భారతీయుల నిర్లక్ష్యమే కారణమవుతుంది.

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!