అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన తెలంగాణ తేజాలు 

అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో  తెలంగాణకు చెందిన సింధు తపస్వి, ఖలీద్ మరియు సహదేవ్ పలు పతకాలు సాధించి ఛాంపియన్లుగా నిలిచారు. 
 
అమెరికాలోని డల్లాస్ లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో తెలంగాణలోని పాల్వంచకు చెందిన సింధు తపస్వి ఒక స్వర్ణం, రజతం మరియు కాంస్యం సాధించింది. ఫైనల్లోని నేపాల్ కు చెందిన ప్రత్యర్థిపై విజయకేతనం ఎగురవేసింది. 
 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఖలీల్ కొరియా ప్రత్యర్థిపై గెలిచి రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం గెలుచుకున్నాడు.
 
 
నగరానికి చెందిన కొండా సహదేవ్ మెక్సికోకు చెందిన ప్రత్యర్థిపై గెలిచి ఒక స్వరణం మరియు రెండు రజత పతకాలు సాధించాడు. 
 
విజేతలు ముగ్గురూ తమ విజయయాలపై స్పందిస్తూ డల్లాస్ చేరినప్పటి నుండి తమకు తోడ్పాటు అందించి, అన్నిరకాల ఏర్పాట్లు కల్పించి, మొదటి నుండి తమకు సహాయంగా నిలిచిన తెలంగాణ టీఆరెస్ ఎన్నారై అమెరికా విభాగం అడ్వైజరీ బోర్డు సభ్యులు డాక్టర్ గోలి మోహన్ కి ధన్యవాదాలు తెలిపారు. 
 
 
తమ టీమ్ విజయం పట్ల కోచ్ జయంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!