ట్రిపుల్ తలాక్ కేసులో మామపై యూపీ సీఎం ఆదిత్యనాధ్ కు ఫిర్యాదు చేసిన ముస్లిం మహిళ

తనను బలవంతంగా హలాల చేయమని వేధిస్తున్నాడంటూ ఉత్తరప్రదేశ్ కు చెందిన నుస్రత్ అనే ముస్లిం మహిళ తన మామపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కి ఫిర్యాదు చేసింది. నుస్రత్ భర్త కొద్దికాలం క్రితం తాగిన మైకంలో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అప్పటి నుండి భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసివుండాలని నిర్ణయించుకున్నారు. ఐతే ఇస్లాంలో ట్రిపుల్ తలాక్ ప్రకారం విడాకులు పొందిన మహిళ తిరిగి తన భర్తతో కలిసివుండాలని అనుకుంటే ముందు వేరొకరిని వివాహమాడి, అతడితో విడాకులు పొంది, అప్పుడు మొదటి భర్తను వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. 
 
తాజా కేసులో నుస్రత్ మామ (భర్త యొక్క తండ్రి) ముందు తనని వివాహమాడాల్సిందిగా బలవంతం చేస్తున్నాడని నుస్రత్ సీఎంకు లేఖ రాసింది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!