డెబ్భై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించిన వేళ.. నల్గొండ జిల్లా చందంపేట మండల ప్రజల్లో ఆనందం   

దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండీ చేస్తున్న నిరీక్షణ ఫలించిన క్షణాలు.. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత మండలాల్లో ఒకటైన చందంపేట వాసులు ఇప్పుడు ఆనందోత్సహాల్లో ఉన్నారు. దగ్గరలోని నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ చుక్క సాగు నీటికి కూడా నోచుకోని చందంపేట మండలం ముదుదండ్ల గ్రామస్తులు ఇక ఈ జీవితంలో తమ గ్రామానికి సాగునీరు వస్తుందా అనుకుంటున్న వేళ.. గలగలా పారుతున్న కృష్ణా పరవళ్లు చూసి పులకరించిపోతున్నారు. 
 
నిజానికి ఈ గుండ్లపల్లి, చందంపేట మండలాలకు దిండి ప్రాజెక్ట్ ద్వారా తాగు మరియు సాగునీటి సరఫరా కోసం 1940లోనే ప్రణాళిక సిద్ధమైంది. వీటికోసం కాలువలు కూడా తవ్వించారు. కానీ ఇప్పటివరకు అది ఆచరణ సాధ్యం కాలేదు. 
 
టీఆరెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి హరీశ్ రావు చొరవతో దిండి ప్రాజెక్ట్ నీరు ముదుదండ్లకు చేరేవిధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే మండలంలోని బాపనకుంట్ల గ్రామానికి కూడా కృష్ణా జలాల విడుదల జరిగింది. 
 
ప్రస్తుత అభివృద్ధి వల్ల చందంపేట, మరుపునూతల, గాగిల్లాపూర్ గ్రామాలు కూడా కృష్ణ జలాలను వినియోగించుకోగలుగుతాయి. 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!