ప్రాణం తీసిన NTV, టీవీ9 కధనాలు? మీడియా అత్యుత్సాహానికి పరాకాష్ట.. మృతుడి బంధువుల ఆందోళన 

ఈ పాపం ఎవరిది? 
సరిగ్గా పది రోజుల క్రితం.. “ఓ కానిస్టేబుల్ రాసలీలలు, పరాయి భార్యతో వివాహేతర సంబంధం” అంటూ టీవీ9 ఛానల్లో ఓ వార్త హల్ చల్ చేసింది. ఇద్దరూ భార్యభర్తల్లా తిరుగుతున్నారంటూ.. వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకున్నారంటూ..  సదరు టీవీ ఛానళ్లు  పనిగా భారీ కథనాలు ప్రసారం చేసాయి. కానిస్టేబుల్ తో ఇంటర్వ్యూలతో నాలుగు గోడల మధ్య జరగాల్సిన పంచాయితీని.. పబ్లిక్ చేశాడు బహిరంగం చేసాయి. కుటుంబ వ్యవహారం అని కూడా చూడకుండా నలుగురికీ తెలిసేలా కథనాలు ప్రసారం చేశాయి. వారం రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు కానిస్టేబుల్ సందీప్ కుమార్ (28). ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం ఉదయం రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్నాడు.  
 
సందీప్ కుమార్ ఆత్మహత్య సంచలనం అయ్యింది. మౌలాలి రైల్వేట్రాక్ మీద చనిపోయాడు. మొఘల్ పుర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు సందీప్ కుమార్. ఈ క్రమంలోనే పెళ్లయిన ఓ అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళ కూతురితో కలిసే ఉంటున్నాడు. దీనిపై మహిళ భర్త రోడ్డుకెక్కటంతోపాటు కానిస్టేబుల్ పై కేసు పెట్టాడు. వారం రోజులుగా వివాదం నడుస్తుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక ఆసక్తి కనబరచిన టీవీ9, NTV న్యూస్ ఛానళ్ళు జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తూ, సంచలనాల 
కోసం పాకులాడుతూ, కుటుంబ సమస్యను సామాజిక సమస్యగా చూపిస్తూ.. మనోభావాలతో పనిలేకుండా అదేపనిగా కధనం ప్రసారం చేశాయి.. ఒక నిండు ప్రాణం పోయేందుకు కారణమయ్యాయి. 
 
దీనికి నిరసనగా మృతుడి బంధువులు టీవీ9కు వ్యతిరేకంగా ధర్నా చేశారు. 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!