అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్లకు ప్రముఖుల శుభాకాంక్షలు 

అమెరికాలోని డల్లాస్ లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. 
 
పోటీల్లో విశేష ప్రతిభ కనబరచి విజేతలుగా నిలిచినా సింధు తపస్వి, ఖలీల్ మరియు సహదేవ్ లకు  టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ డాల్లస్ అసోసియేషన్ మరియు తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్(TANTEX) సభ్యులు ప్రత్యేక అభినందనలు  తెలియజేసారు. ఈ సందర్భంగా టీఆరెస్ ఎన్నారై అమెరికా విభాగం అడ్వైజరీ బోర్డు సభ్యులు గోలి మోహన్ మాట్లాడుతూ దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులను ప్రశంసించారు. వీరు ఇదే విధంగా అనేక విజయాలు సాధించి భారతదేశానికి మరిన్ని పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. 
టీఆరెస్ ప్రభుత్వం ఛాంపియన్లకు ఆర్ధిక సహాయ, సహకారాలతో పాటు అమెరికాలో వసతి ఏర్పాట్లు కల్పించిందని.. ఇదే విధంగా ఎల్లప్పుడూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి, అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తుందని టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ (డల్లాస్ విభాగం) తెలిపింది.
 
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఇరు సంఘాల సభ్యులు కృష్ణవేణి, కృష్ణ కోడూరు, పవన్ రాజ్ నెల్లుట్ల, రఘు, దేవేందర్, శశికాంత్, శ్రీనివాస్ సురభి, శ్రీనివాస్ కొట్టే, కె. చంద్ర తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. అవర్ ప్లేస్ రెస్టారెంట్ అధినేత నరేందర్ బాబు ఈ కార్యక్రమానికి సహాయ సదుపాయాలు అందించారు.
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!