నన్స్ వేధింపులు భరించలేక అనాధాశ్రమం నుండి పారిపోయిన 20 మంది బాలికలు 

కేరళ: ఎర్నాకుళంలోని క్రైస్ట్ కింగ్ అనాధాశ్రమ బాలికలు అర్ధరాత్రి వీధినపడ్డారు. అక్కడ ఉండే నన్స్ వేధింపులు తట్టుకోలేక సుమారు 20 మంది బాలికలు అనాధాశ్రమం నుండి బయటకు వచ్చేసారు. వీరంతా 7-15 ఏళ్ల వయసు గలవాళ్ళు. 
 
అనాధాశ్రమ నిర్వాహకులైన నన్స్ తమను నిరంతరం వేధిస్తున్నారని, సరైన తిండి పెట్టకపోగా ఇష్టంవచ్చినట్టు కొడుతున్నారని వీరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 
 
నిజానికి ఎర్నాకుళంలోని అనాధశరణాలయాలు ఇప్పటి నుండో వివాదాల్లో ఉన్నాయ్. గత జులైలో ఇదే ప్రాంతంలోని ఒక ఒక అనాధాశ్రమం మీద పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేసి 28 మంది బాలికలకు విముక్తి కల్పించారు. 
 
పోలీసులు జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!