యాచకుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పునరావాస కేంద్రాలు: తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం 

తెలంగాణ రాష్ట్రాన్ని యాచక రహిత రాష్ట్రంగా మార్చే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో నిరుపయోగంగా పడివున్న జైలు భవనాలను యచకుల పునరావాస కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది. దీని కోసం రాష్ట్ర జైళ్ల శాఖ అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. 
 
“తమ ప్రతిపాదనకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నాం” అని వీకే సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే జైళ్ల శాఖ చంచలగూడ, చర్లపల్లి కేంద్ర కారాగారాలలో యాచకుల పునరావాసల కోసం ఆనంద ఆశ్రమాలు ఏర్పాటు చేసింది.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!