NDTV అక్రమాల కేసు: సుబ్రహ్మణ్యం స్వామి టార్గెట్ చేశారంటూ ప్రధానికి ప్రణోయ్ రాయ్ లేఖ

NDTV అక్రమాస్తుల కేసులో ఉచ్చు బిగుసుకుంటున్న తరుణంలో ఛానెల్ అధిపతి ప్రనోయ్ రాయ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో తనపై అదే పనిగా ఆధారసహిత ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామిని కట్టడి చేయాలంటూ ప్రధానికి బహిరంగలేఖ రాసే పరిస్థితికి వచ్చాడు. 
 
2017 జూన్లో నిధుల అక్రమ మల్లింపు, బ్యాంకుని మోసాగించి అక్రమ ఋణాలు తీసుకున్న కేసులో సీబీఐ అధికారులు ప్రణోయ్ రాయ్ ఇంటిమీద దాడి చేశారు. ఇది జరిగిన కొద్ది నెలలకు భారతీయ స్టాక్ ఎక్స్చేంజి అదే అక్రమ బ్యాంక్ లోన్ వ్యవహారంలో ఎన్డీటీవీ వివరణ కోరింది. దీనిపై అప్పట్లో ప్రనోయ్ రాయ్ దంపతులు నానా యాగీ చేశారు. తమ వామపక్ష పాత్రికేయుల సహాయంతో ‘పత్రికా స్వేచ్ఛపై దాడి’ చేసేస్తున్నారంటూ గోలగోల చేశారు. 
 
ఈలోపు మరో దెబ్బ.. అక్టోబర్ 2017లో ఆదాయపన్ను ఎగవేత కేసులో ఎన్డీటీవీ ఇరుక్కుంది. సుమారు 1600 కోట్ల రూపాయల అవినీతి ఇది. ఎన్డీటీవీలో వాటాదారుడిగా ఉన్న RRPR Holdings Pvt Ltd కంపెనీ యొక్క షేర్లు మొత్తం ఆదాయపన్ను శాఖ జప్తుచేసింది. ప్రణోయ్ రాయ్ భార్య రాధిక రాయ్ కి చెందిన ఈ RRPR కంపెనీ ఎన్డీటీవీ ప్రమోటర్లలో ఒకటి. ఈ కేసుకు సంబంధించి గత నెలలో ఆదాయపన్ను శాఖ ఎన్డీటీవీపై రూ.436.80 కోట్ల జరిమానా విధించింది. ఆస్తుల జప్తుతో పాటు మరిన్ని చర్యలకు రంగం సిద్ధమైంది. 
 
ఈ సమయంలో ప్రణోయ్ రాయ్ ప్రధానికి లేఖ రాశారు. సుబ్రహ్మణ్యం స్వామి తనను  టార్గెట్ చేశారని, ఎన్డీటీవీ గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, రక్షించండి అనేది ఆ లేఖ ప్రధాన సారాంశం. 
 
గతకొంతకాలంగా ఎన్డీటీవీ అక్రమాల వ్యవహారంలో స్వామి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రణయ్ రాయ్ రాసిన లేఖ చదివితే అతడు ఎంత తికమకకు గురవుతున్నాడో అర్ధమవుతుంది. 
 
నిజానికి ఎన్డీటీవీ అక్రమాలపై స్వామి చేస్తున్నవి ఊహాజనిత ఆరోపణలు కావు అనేది ఋజువవుతోంది. అతడిపై చర్యలకు ఉపక్రమిస్తున్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖ మొదలైన ప్రభుత్వ సంస్థలు. అయితే ఆయా శాఖలు స్వామి ఒత్తిడి కింద పని చేస్తున్నాయంటూ ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధాలున్న విదేశీ కంపెనీ యజమానులు ఇమ్మెల్ట్ మరియు జుకెర్ వంటివారికి కోర్టులు సమన్లు జారీచేసినట్లైతే భారతదేశానికి విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయంటూ గోల చేయడం మొదలుపెట్టారు. 
 
మొదట ‘ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్’ అడ్డంపెట్టుకున్న ప్రణోయ్ రాయ్ ఇప్పుడు విదేశీ పెట్టుబడులు రాకుండా పోతాయి అంటూ సరికొత్త రాగం మొదలుపెట్టాడు.

@AS_Santosh

రచయిత సామాజిక, మానవ హక్కుల కార్యకర్త

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!