అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ 

హైదరాబాద్ ఎంపీ, ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఆర్మీ గట్టిగా స్పందించింది. అమరజావాన్లను మతపరంగా విడదీసి చూసే అలవాటు మాకు లేదు” అని ఆర్మీ ఉత్తర విభాగం ముఖ్య కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ జెనరల్ దేవరాజ్ అన్బు అన్నారు.
 
సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై తీవ్రవాదుల దాడి ఘటనపై స్పందిస్తూ అసదుద్దీన్ ఒవైసీ “ముస్లిముల దేశభక్తిని ప్రశ్నిస్తున్న వాళ్ళు ముస్లిం సైనికుల మరణాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు” అంటూ చేసిన వ్యాఖ్యలపై జనరల్ దేవరాజ్ పైవిధంగా స్పందించారు. 
 
కాశ్మీర్ యువత మిలిటెంట్ గ్రూపుల్లో చేరుతుండటం పట్ల  దేవరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఆధారంగా కొందరు యువతలో వేర్పాటువాద భావాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. అలా తీవ్రవాద గ్రూపుల్లో చేరినవాళ్ళు దాని వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం లేదన్న నిజాన్ని గ్రహించాల్సిందిగా హితవు పలికారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!