ఆ పాటపై హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

విడుదలైన కొద్దిరోజుల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిన మలయాళ సినిమా పాట “మాణిక్యా మలరాయ పూవి” ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఒరు అదర్ లవ్ సినిమాలోని ఈ పాట నటి ప్రియా ప్రకాశ్ వారియర్ పలికించిన హావభావాలు కారణంగా సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ సంపాదించింది. అయితే ఈ పాట ముస్లిం మనోభావాలను కించపరిచేదిగా ఉందంటూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముఖీత్ అనే విద్యార్థి ఫలక్నమా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. న్యాయపరమైన సలహా కోసం పిర్యాదుని ఉన్నతాధికారులకు పంపిన పోలీసులు, ఆ తరువాత సెక్షన్ 295A కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు ప్రకటించారు.

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!