తెలంగాణ విద్యాలయాల్లో ఇకపై తెలుగు తప్పనిసరి: ఆర్డినెన్స్ తీసుకురానున్న టీఆరెస్ ప్రభుత్వం

తెలుగు భాష ఔన్నత్యం  ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాలయాల కరిక్యులంలలో తెలుగు తప్పనిసరి సబ్జెక్టు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురానుంది. తద్వారా స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ మొదలైన అన్ని రకాల విద్యాలయాల్లోనూ ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ (+2) వరకు ఈ నిబంధన అమలులోకి రానుంది. 
 
ఇందులోని సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 2017లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసింది.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!