25 ముస్లిం కుటుంబాలకు మసీదులో ప్రవేశం నిషేధం – బిజెపికి మద్దతివ్వడమే కారణం

త్రిపుర రాష్ట్రంలోని శాంతినగర్ నియజకవర్గం పరిధిలోని మొయిదాతిల్లా గ్రామంలోని 25 ముస్లిం కుటుంబాలు సొంత వర్గీయుల నుండి సామాజిక బహిష్కరణకు గురవుతున్నాయి. 
 
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామంలోని 25 ముస్లిం కుటుంబాలకు చెందిన ప్రజలు  స్థానిక బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించారు. దీంతో స్థానిక ముస్లింలు వారు ఆ గ్రామంలో ఉన్న ఏకైక మసీదులో ప్రవేశించకుండా నిషేధం విధించారు. 
 
దీనిపై బాధితుల్లో ఒకరైన బాబుల్ హుస్సేన్ అనే రైతు మాట్లాడుతూ “16 నెలల క్రితం తమతో పాటు మరికొన్ని కుటుంబాల వారు బీజేపీలో చేరాము, ఇప్పుడు ఎన్నికల సందర్భంగా స్థానిక బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తుండడం కారణంగా మమ్మల్ని మసీదులోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు” అని తెలిపాడు. 
 
నిషేధానికి గురైన 25 కుటుంబాలు కలిసి చందాలు వేసుకుని అదే గ్రామంలో మరొక ప్రత్యామ్నాయ మసీదుని నిర్మించుకున్నాయి. 
 
బీజేపీని హిందుత్వ పార్టీగా మేము భావించటం లేదు అని, ఆ పార్టీ ముస్లిములపై మతపరమైన దాడులకు పాల్పడుతోందన్న వాదనను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వారు తెలిపారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!