బెంగళూరులో భారతీయ విద్యార్ధులపై అమెరికన్ల వర్ణవివక్ష

బెంగళూరు ఇండియన్ సోషల్ ఇనిస్టిట్యూట్లో ఇద్దరు అమెరికన్ దేశస్థులు భారతీయ విద్యార్థులు, స్టాఫ్ తో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మధ్యాహ్నం భోజనాల సమయంలో డైనింగ్ హాల్లో.. అందరూ కలిసి భోజనం చేస్తుండగా అక్కడే ఉన్న అమెరికన్లు “మీ ప్లేట్లు తీసుకొని బయటకి వెళ్లిపోండి” అని భారతీయ విద్యార్థులను ఆదేశించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని భారతీయ విద్యార్థులు, స్టాఫ్ తమతమ ప్లేట్లు తీసుకుని బయటకి వెళ్లి భోజనం చేశారు. అయితే అక్కడే ఉన్న భారతీయ విద్యార్థి వారి వద్దకు వెళ్లి అలా ప్రవర్తించడానికి ఎంత ధైర్యం అని నిలదీయగా కంగుతిన అమెరికన్లు క్షమాపణ చెప్పినట్టు తెలిసింది. 
 
ఘటనపై బెంగళూరుకు చెందిన వ్యక్తి ట్విట్టర్ ద్వారా పాలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసును జయనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!