ఏడాదికి రూ. 70.5 కోట్లు..  ఇదీ ‘సామాన్యుడి ప్రభుత్వం’ ప్రచార ఖర్చు 

‘సామాన్యుడి’ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ  గత మూడు సంవత్సరాలుగా ప్రచారం కోసం చేసిన ఖర్చు ఏడాదికి సగటున 70.5 కోట్ల రూపాయలు అని తేలింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఢిల్లీ ప్రభుత్వం ఈ వివరాలు సమర్పించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే ఈ ఖర్చు నాలుగు రెట్లు అధికం. 
 
కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చీ రాగానే ఆప్ ప్రభుత్వంమొదటి సంవత్సరంలో 59.9 కోట్లు ప్రచారం కోసం ఖర్చు చేసింది. ఆ తరువాతి సంవత్సరం 59.9 కోట్లు, ఆ తరువాత 66.3 కోట్ల నుండి ప్రస్తుతం 85.3 కోట్లకు ఆ ఖర్చు చేరింది. 
 
ఇక్కడ గమనించాలసిన విషయం ఏమిటంటే ఢిల్లీ ప్రభుత్వం తమిళనాడు, ఒడిషా, గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాలలో కూడా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో తమ పథకాల ప్రచారం కోసం ఖర్చు చేయడం.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!