చిన్నారుల అక్రమ రవాణా సంస్థను పురస్కారంతో సత్కరించిన సోనియా గాంధీ!!

24 మే, 2014.. కేరళలోని పలక్కడ్ రైల్వే జంక్షన్లో ఒక రైలు వచ్చి ఆగింది. అక్కడికి వచ్చే అన్ని రైళ్ల లాగానే ఇది కూడా విపరీతమైన రద్దీతో కిటకిటలాడుతోంది. అనేకమంది టికెట్ తీసుకోకుండానే ప్రయాణిస్తున్నారు. కానీ ఏదో తేడా.. అందులో ప్రయాణిస్తున్న 456 చిన్నారులు.. వారిలో అనేకమంది వెంట తల్లిదండ్రులు లేకుండానే ప్రయాణం సాగిస్తున్నారు. వారంతా బెంగాల్, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని నిరుపేద ప్రాంతాలకు చెందినవారు. 
 
ఆ తరువాత 25 మే 2014లో మరో పశ్చమ బెంగాల్ నుండి మరొక రైలు 123 మంది చిన్నారులతో పలాక్కోడ్ స్టేషన్లో ఆగింది. 
 
దీనిపై మరుసటి రోజు ది హిందూ పత్రికలో వరుస వార్తా కధనాలు ప్రచురితమయ్యాయి. ఆ రెండు రైళ్ల ద్వారా 578 మంది చిన్నారులను అక్రమంగా తరలిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారని.
 
 
 
 
పిల్లలను ఎక్కడికి తరలిస్తున్నట్టు? ఇదే విషయం తెలుసుకునేందుకు జార్ఖండ్ కార్మిక శాఖ అధికారులను సంప్రదించగా, నిబంధనలకు విరుద్ధంగా ఆ పిల్లల్ని కేరళ రాష్ట్రానికి తరలిస్తున్నట్టు లేబర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి మనీష్ సిన్హా స్పష్టం చేసినట్టుగా మరొక కధనం ప్రచురితమైంది. ఏజెంట్ల ద్వారా ఒక్కో పిల్లవాడికి రూ.1500 చెల్లించి వారిని కొనుక్కుంటునట్టు తమ విచారణలో తేలిందని మనీష్ సిన్హాను ఉటంకిస్తూ ది హిందూ తన కధనంలో పేర్కొంది. 
 
 
7 జూన్ 2014లో ఈ ఘటనకు సంబంధించిన మరొక వార్త ది టెలిగ్రాఫ్ పత్రికలో ప్రచురితమైంది.
 
 
రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ చిన్నారులంతా నిజానికి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లో ఉన్న ముక్కం ముస్లిం అనాధాశ్రమానికి తరలిస్తుండగా పట్టుబడ్డారు అన్న విషయం తెలిపింది. 
 
 
 
సెక్యులర్ మనసులు విరిగిపోయే మరొక అసలైన విషయం ఏమిటంటే.. ఆ ముక్కం ముస్లిం అనాధాశ్రమానికి చైర్మన్ ఎవరో కాదు.. ఇండియన్ యునైటెడ్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అధినేత సయ్యద్ హైదర్ అలీ తంగల్. ఆ పార్టీ కాంగ్రెసుకు ప్రధాన మిత్రపక్షం మరియు యూపీఎ ప్రధాన భాగస్వామ్య పక్షం కూడా. 
 
అయితే? అసలు విషయం ఏమిటి అంటారా?? ముక్కం ముస్లిం అనాధాశ్రమానికి కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్పర్సన్ చేతుల మీదుగా కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పురస్కారం లభించింది. 
 
దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో స్క్రీన్ షాట్  ఈ క్రింద ఉంది. ఇది చదివిన తరువాత దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో కూడా చూడవచ్చు. (రేణుకా చౌదరి అందమైన దరహాసం వీక్షించడానికే ఈ స్క్రీన్ షాట్ ఇచ్చాను). 
 
 
పిల్లలని 1500 రూపాయల చొప్పున అక్రమంగా దిగుమతి చేసుకునే సంస్థకు  ప్రజల సొమ్ముతో ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పురస్కారమా? పైగా ప్రభుత్వంలో భాగమైన జాతీయ సలహా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ చేతుల మీదుగా. 
 
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం..
– 456 మంది పిల్లలతో వచ్చిన మొదటి ట్రైన్ పలక్కోడ్ చేరిన తేదీ 24 మే, 2014. 
 
– 123 మంది పిల్లలతో ట్రైన్ పలక్కోడ్ చేరిన తేదీ 25 మే, 2014.
 
– నరేంద్ర మోడీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తేదీ 26 మే, 2014.
 
కేవలం రాహుల్ గాంధీ మాత్రమే దీనికి సమాధానం చెప్పగలడు అని అనుకుంటున్నాను.
 
ఆధారం: www.opindia.comలో Sujay వ్రాసిన వ్యాసం 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!