నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ.. రెండోసారి పదవీ బాధ్యతల స్వీకరణ 

నేపాల్‌ ప్రధాని పీఠాన్ని కేపీ శర్మ ఓలీ రెండోసారి అధిష్టించారు. కాఠ్‌మాండూలోని రాష్ట్రపతి కార్యాలయంలో గురువారం శర్మ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వామపక్ష కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. శర్మ నేతృత్వంలోని నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్‌)-యూఎమ్‌ఎల్‌, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌-మావోయిస్టు సెంటర్‌ ఈ కూటమికి నేతృత్వం వహించాయి. కేపీ శర్మ ప్రమాణస్వీకారానికి ముందు ప్రధాని పదవికి నేపాలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శేర్‌బహాదుర్‌ రాజీనామా సమర్పించారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!