PNB అవినీతి గుట్టు రట్టుకు ప్రస్తుత ప్రభుత్వ విధానాలే కారణం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవినీతి వ్యవహారంలో సొమ్మును తిరిగి రాబడతామని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి వల్లే ఈ వ్యవహారం బయటకొచ్చిందని రాజీవ్ తెలిపారు. దీనిపై ఆయన గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి తాజా పరిణామాలను వివరించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ దఫా కూడా నీరవ్‌ LoU ల పొడిగింపును అనుమతించినట్లయితే మోసం ఇప్పటికీ బయటపడేది కాదు. ప్రక్షాళన కోసం వచ్చిన ఒత్తిడి వల్ల బ్యాంకు తనంతట తానే ఈ కుంభకోణాన్ని గుర్తించింది’’ అని తెలిపారు. ఈ మోసం ఏడేళ్లపాటు నిరాటంకంగా ఎలా సాగిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ అది వ్యవస్థకు సంబంధించిందని, దానిపై నిశితంగా పరిశీలించాల్సి ఉందని తెలిపారు. ‘‘ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలేది లేదు. ఇది ఒక బ్యాంకు శాఖలో జరిగిన వ్యవహారం. ఇతర బ్యాంకులకు విస్తరించే అవకాశం లేదు. అన్ని బ్యాంకులనూ అప్రమత్తం చేశాం. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వద్ద ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సరిపడా నిధులు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!