PNB అవినీతి వ్యవహారంలో కాంగ్రెస్ పాత్ర!! బయటపడ్డ కీలక ఆధారాలు

సంచలనం సృష్టిస్తున్న 1700 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవినీతి కేసులో మరో కోణం బయటపడింది. OpIndia ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 
 
అప్పటి అల్లాహాబాద్ బ్యాంక్ డైరెక్టర్ దినేష్ దూబె 2013లోనే ఈ విషయాన్ని అప్పటి రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరు కేసీ చక్రవర్తి దృష్టికి తీసుకువచ్చారు. OpIndia సేకరించి ఈమెయిల్ వివరాల ప్రకారం…
 
14 సెప్టెంబర్ 2013లో న్యూఢిల్లీలోని రాడిసిన్ హోటల్లో నీరవ్ మోడీకి చెందిన గీతాంజలి జ్యుయాలరీస్ సంస్థ ప్రతినిధులు, అల్లాహాబాద్ బ్యాంక్ అధికారుల మధ్య ఒక సమావేశం జరిగింది. గీతాంజలి జ్యుయాలరీస్ సంస్థకు 1500 కోట్ల రూపాయలు ఋణం రూపంలో  మంజూరు చేయాలంటూ ఒక అభ్యర్ధన తీసుకువచ్చారు. దానికి అప్పటి అల్లాహాబాద్ బ్యాంక్ డైరెక్టర్ దినేష్ దూబె తిరస్కరించారు. అయినప్పటికీ దినేష్ దూబె నిర్ణయం బుట్టదాఖలు చేస్తూ సదరు సంస్థకు రూ. 1500 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ విషయాన్ని వివరిస్తూ దూబె రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గరవ్నర్ చక్రవర్తికి మెయిల్ ద్వారా సమాచారం అందించారు. దాని మీద చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 
ఇంకా ఆ మెయిల్లో ఏముందంటే.. పలుమార్లు వారి అభ్యర్థన తిరస్కరించినప్పటికీ ఆ అంశాన్ని మళ్లీ మళ్లీ లెవనెత్తుతూ, పలుమార్లు బోర్డు ఆమోదం కోసం తీసుకురావడం జరిగింది.  ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చినందుకు వేధించడం మొదలుపెట్టారు. పైగా రిజర్వ్ బ్యాంక్ నామినీ డైరెక్టర్ ఉద్గాతా ఈ అంశంపై స్పందిస్తూ “ఎక్కడి విషయాలు అక్కడే ఉండనివ్వాలి” అని చెప్పారు. చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోవడానికి ఇలాంటి అంశాలు అప్పుడప్పుడు బోర్డు ఆమోదానికి వస్తుంటాయి అని తెలిపారు. 
 
 
గీతాంజలి జ్యుయాలరీస్ సంస్థకు రుణాల ఆమోదం తెలిపిన తరువాత నాపై వేధింపులు ఎక్కువయ్యాయని, ఫలితంగా 11 నెలల తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది దూబె తెలిపారు. ఋణ అభ్యర్ధనలు తిరస్కరించడంతో అప్పటి ఆర్ధిక కార్యదర్శి రాజీవ్ టకృ నాపై ఒత్తిడి తీసుకువచ్చారు అని కూడా దినేష్ దూబె తెలిపారు. 
 
ఇప్పటిదాకా ఎన్డీయే ప్రభుత్వాన్ని నిందిస్తూ చక్కని అవకాశం కొట్టేశాము అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి.. అప్పట్లో దూబె చేసిన హెచ్చరికలు కావాలని పెడచెవిన పెట్టడానికి గల కారణాలు ఏమిటో దేశానికి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!