గుంటూరు జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు 

గుంటూరు జిల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెనాలిలో కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఖాదిర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలిలోని శబరి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి, వృద్ధులకు అన్నదానం చేశారు. 
 
అనంతరం ఖాదిర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎన్నో ఉద్యమాలు చేశారని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్ర ప్రాంత ప్రజలు హక్కుల కోసం పోరాడాలి అని అన్నారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!