తెలుగు అక్షరం కారణంగా హ్యాంగ్ అవుతున్న ఐఫోన్లు !

ఓ తెలుగు అక్షరం  ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ వినియోగదారులను ఇక్కట్లకు గురి చేస్తున్నది. ఐఓఎస్ 11.2.5 వెర్షన్‌లో పనిచేస్తున్న ఐఫోన్లు ఆ అక్షరం కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడి పనిచేయకుండా పోతున్నాయి. ఐఫోన్ వినియోగదారులు ఐ మెసేజ్ యాప్‌లో మెసేజీలు, పోస్టులు పెట్టేటప్పుడు జ్ఞా అనే అక్షరాన్ని వాడుతున్నప్పుడు, లేదా ఆ అక్షరం ఉన్న సందేశాలు తమ ఫోన్లకు వచ్చినప్పుడు ఫోన్ వెంటనే పనిచేయకుండా ఆగిపోతున్నది. ఐఫోన్ వినియోగదారులు ఫేస్‌బుక్, లేదా వాట్సాప్ చర్చల్లో జ్ఞా అనే అక్షరాన్ని వాడినా.. ఇతరులు ఎవరైనా పెట్టిన పోస్టులో జ్ఞా అనే అక్షరం ఉన్నా.. వెంటనే ఫోన్ పనిచేయటం లేదు. ఐఫోన్లు, మ్యాక్ బుక్స్, యాపిల్‌వాచ్‌లపై కూడా ఈ ప్రభావం పడింది. దీనిపై Apple సంస్థ స్పందించింది. ఒక భారతీయ భాష ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లతో పాటు మిగతా ఉత్పత్తులను క్రాష్ చేస్తున్నదని గుర్తించింది. త్వరలోనే సమస్యను పరిష్కరించి ఈ అక్షరాన్ని తిరిగి వాడుకలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని యాపిల్ సంస్థ పేర్కొన్నది.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!