సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ సీఎం బర్త్ డే సాంగ్ 

నేడు కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రమంతటా తెరాస నేతలు, ఆయన మద్దతుదారులు ఓ పండుగలా సంబురాలు చేసుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియో పాటను రూపొందించారు. దాదాపు 18 మంది టాలీవుడ్‌ గాయకులు ఈ పాటను పాడారు. వీరాధి వీరుడు అతడు.. అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. కేసీఆర్‌ తీసుకొచ్చిన పలు అభివృద్ధి పథకాల గురించి ఈ పాటలో చక్కగా వివరించారు. ఈ వీడియో సాంగ్‌ను కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!