ఓ నాన్నా.. ఎవరు నీకు దిక్కు?

వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిదిలోని  వైదేహీనగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వృద్ధ తండ్రిని కొడుకులు రోడ్డుపై వదిలివేశారు.  
 
శనివారం రాత్రి నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే  వృద్ధుడు వనస్థలిపురం పరిధిలోని వైదేహీనగర్లో నివాసం ఉంటున్నతన పెద్ద కొడుకు గణేష్ (వడ్డి వ్యాపారి) వద్దకు వచ్చాడు. కానీ ఆ సుపుత్రుడు తన తండ్రిని ఇంట్లోకి రానివ్వకుండా బయటకు గెంటివేసి ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు.
 
ఆ ముసలి తండ్రి రాత్రంతా తన కొడుకు ఇంటి ముందు చెట్టు కింద నిరీక్షించినా ప్రయోజనం లేకపోయింది. 
 
మల్లయ్యకు పది మంది సంతానం.. 5 కోడుకులు, 5 కూతుర్లు ఉన్నారు. అందరూ ఆర్ధికంగా స్థిరపడ్డారు.. కానీ ఏ ఒక్కరు కూడా చూడని ఈ తండ్రిని పట్టించుకునేందుకు ముందుకు రాలేదు. 
 
ఆరుబయట కొడుకు ఇంటి ముందు ఎదురుచూస్తూ ధీనస్థితిలో పడివున్న మల్లయ్య దీన పరిస్థితి చూసి దారినపోయే వారు విచారం వ్యక్తం చేశారు. కొందరు ఆహారం సమకూర్చారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!