వీడియోకాల్‌ మాట్లాడుతూనే ఆత్మహత్య

హైదరాబాద్‌: ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ హైదరాబాద్‌ నగర శివారు కొంపల్లిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న హనీషా చౌదరి అనే విద్యార్థిని అదే కళాశాలకు చెందిన హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. మృతురాలు అనంతపురం జిల్లాకు చెందిన బుగ్గయ్య చౌదరి కుమార్తెగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు హనీషా తన ప్రేమికుడు దక్షిష్‌ పటేల్‌తో వీడియోకాల్‌లో మాట్లాడింది. వీడియోకాల్‌లో అతను చూస్తుండగానే ఫ్యాన్‌కు ఉరేసుకుంది. దీంతో అతడు వెంటనే హాస్టల్‌ గదికి చేరుకున్నాడు. లోపల గడియపెట్టి ఉండడంతో తలుపులు బద్దలుకొట్టి తెరిచాడు. ఫ్యాన్‌కు ఉరేసుకున్న హనీషాను అమె స్నేహితురాలి సాయంతో కొంపల్లిలోని సిగ్మా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే హనీషా ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనీషా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!