అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకుంటున్న హిందూ ఉద్యమకారుడు తపన్ ఘోష్ 

హిందూ ఉద్యమకారుడు తపన్ ఘోష్ కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. కోలకత్తాలో ఈనెల 14న హిందూ సంహతి ఆధ్వర్యంలో జరిగిన రాలీ సందర్భగంగా తపన్ ఘోష్ని బెంగాల్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఐతే తపన్ ఘోష్ కి అంతర్జాతీయంగా విశేష మద్దతు లభిస్తోంది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా అమెరికాలోని ప్రవాస భారతీయ సంఘాలు వివిధ అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. అంతే కాకుండా తపన్ ఘోష్ ను విడుదల చేయాలంటూ అమెరికన్ కాన్సులేట్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నాయి.
 
అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్, కాలిఫోర్నియా, చికాగో, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరగనున్నాయి. అంతేకాకుండా కెనడా, మెక్సికో దేశాల్లో కూడా ఇదే తరహా ప్రదర్శనలు చేయనున్నట్టు సమాచారం. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!