ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సనత్నగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఇటీవల గుండు హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది. సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు.  

‘అహ నాపెళ్లంట’ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన హనుమంతరావు సుమారు 400లకు పైగా సినిమాల్లో నటించారు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్‌ హీరో, కొబ్బిరి బోండాం, బాబాయ్‌ హోటల్‌, శుభలగ్నం, క్రిమినల్‌, పెళ్లాం ఊరెళితే తదితర చిత్రాల్లో అద్భత నటన కనబర్చారు. టెలివిజన్ తెరపై ఆయన నటించిన ‘అమృతం’ సీరియల్‌లో అంజి పాత్రలో ఆయన కనబర్చిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సీరియల్‌కు గాను ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు.
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!