బలవంతపు మతమార్పిడి.. ఆపై అత్యాచారం – ముంబైలో దారుణం

ముంబైలో దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. తనను బలవంతంగా మతం మార్చి, అత్యాచారం చేసినట్టు ఓ మహిళా అడ్వొకేట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఫైజల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 
 
అందిన సమాచారం ప్రకారం.. ముంబైకి చెందిన ఫైజల్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో హైకోర్టు అడ్వకేటుగా పనిచేస్తున్న ఓ మహిళని తన చెల్లి పెళ్ళి సందర్భంగా బీజ్నోర్ రావాల్సిందిగా ఆహ్వానించాడు. దీంతో ఆ మహిళ అతడితో పాటు వెళ్ళగా మార్గం మధ్యలో నహ్తౌర్ పట్టణంలో ఆమెని బంధించి, వారం రోజుల పాటు అత్యాచారం జరిపాడు. ఆమెకి బలవంతంగా బురఖా వేసి మతం మార్చినట్టు, అనంతరం తన చెల్లి వివాహం సమయంలోనే ఈమెని నిఖా చేసుకోవాలని ప్రయత్నించినట్టు బాధితురాలు తెలిపింది. తనను మానసికంగా, శారీరికంగా వేధించడాని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది. అతడికి అతడి కుటుంబ సభ్యులు కూడా సహకరించిన విషయం వెల్లడించింది. 
 
నిందితుడు ఫైజల్ తన చెల్లి పనుల కోసం షాపింగ్ కు వెళ్ళగా ఆ సమయంలో బాధితురాలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఫైజల్ ని అరెస్ట్ చేయగా మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.
 
source

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!