హైద్రాబాదులో సంస్థ కార్యాలయం ప్రారంభించనున్న అడోబ్

హైదరాబాద్ : సాఫ్ట్వేర్ దిగ్గజం అడోబ్ తన సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా మంత్రి కేటీఆర్ అడోబి చైర్మన్ శంతన్ నారాయణ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అడోబ్ సంస్థ తన శాఖను నెలకొల్పాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు. మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన శంతన్ నారాయణ్ అడోబ్ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాదుకు ప్రత్యేక స్థానం ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే అడోబి బ్ కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలు, సంస్థ విస్తరణ వంటి వాటిపై సంస్థ ఒక ప్రకటన చేస్తామని మంత్రి కేటీఆర్ కు తెలిపారు.

అడోబ్ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సంస్థ ఏర్పాటుకు అవసరమైన సహయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంతో ఈకో సిస్టమ్‌ లో ఒక కొత్త ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ యువతకు ఆయా రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!