కాపు రిజర్వేషన్లు – కథా కమామీషు (3వ భాగం) 

ఇందిరా సహనీ కేసు తీర్పులో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా విషయాలు చెప్పింది. కాని కొన్ని ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇక్కడ చూద్దాం.
 
1. ప్రభుత్వాలు చట్టం చేయకుండా, కేవలం Executive Order తో రిజర్వేషన్లు కల్పించవచ్చు.
 
2. బాలాజీ కేసులో తీర్పు సరి అయినదే. 
  • రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం దాటకూడదు. అయితే కొన్ని Extraordinary Circumstancesలో ఆ పరిమితి దాటొచ్చు.
  • ఉదాహరణకి ఏదైనా ఒక సమూహం కొన్ని ప్రత్యేకకారణాల వలన సమాజ అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఉండిపోయి, సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడి ఉద్యోగాలలో అత్యంత తక్కువ ప్రాతినిధ్యం ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ, ఒక్కొక్కప్పుడు మొత్తం 50 శాతం పరిమితి దాటవచ్చు. అయితే ఆ Extraordinary Circumstances ఏమిటో వివరించాలి. 
  •  అత్యంత అరుదుగా మాత్రమే 50 శాతం పరిమితి దాటొచ్చు.
  •  అసలు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు ఇచ్చేముందు ప్రత్యేకంగా బీసీ కమిషన్ను కేంద్ర స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ నియమించాలి. వాళ్ళ రిపోర్టును ప్రభుత్వాలు సాధారణంగా ఆమోదించాలి. అయితే ప్రభుత్వాలు విభేదిస్తే, కారణాలు రాయాలి.
  • వెనుకబడిన వర్గాలలో క్రీమీ లేయర్ ని రిజర్వేషన్ నుండి తొలగించాలి. క్రీమీ లేయర్ అంటే ఏమిటో ప్రభుత్వాలు నిర్ణయించాలి. క్రీమీ లేయర్ థియరీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వర్తించదు. 
3) కేవలం ఆర్ధిక వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు.
 
..ఈ తీర్పుని ప్రస్తుతానికి పక్కకు పెట్టి మరొక తీర్పును చూద్దాం.
 
వామన్ రావ్ VS యూనియన్ ఆఫ్ ఇండియా (1981) 2 SCC 362 అనే కేసులో  రాజ్యాంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం సుప్రీంకోర్టుకు వచ్చింది. 24 ఏప్రిల్ 1973 తరవాత 9th షెడ్యూల్ లో ఏదైనా చట్టాన్ని చేరిస్తే, ఆ చట్టం రాజ్యాంగం తాలూకా basic structure ని అతిక్రమించిందని ఎవరైనా కోర్టుకు వస్తే, దాన్ని విచారించే హక్కు హైకోర్టుకు గాని, సుప్రీంకోర్టుకి కాని ఉంటుందా అన్నది  ప్రశ్న. అందులో 5 గురి ధర్మాసనం, ఈ విషయం తొమ్మిదిమంది జడ్జీల ధర్మాసనం విచారిస్తే బాగుండునని అభిప్రాయపడింది. చివరకు 2007 సంవత్సరంలో I R Coelho VS State of Tamilnadu  అనే కేసులో తొమ్మిదిమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయంపై తీర్పు ఇచ్చింది
 
(సశేషం.. )
 

వృద్ధుల కళ్యాణ రామారావు

రచయిత సామాజిక విశ్లేషకులు, సీనియర్ న్యాయవాది

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!