రిలీజ్ అయిన కొద్ది గంట‌ల్లోనే ఆర్టీసీ బ‌స్సులో సినిమా ప్రదర్శన 

బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ జోడీగా నటించిన ‘ఐయారి’ సినిమా 2018 ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌లైంది. ఐతే ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 19న ఉద‌యం 7.30 గంట‌ల స‌మ‌యంలో ముంబై నుండి గోవాకి వెళ్ళే మ‌హారాష్ట్ర‌రోడ్డు ర‌వాణా సంస్థ‌కి చెందిన బ‌స్సులో ప్ర‌ద‌ర్శిత‌మైంది. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న బ‌స్సులో ఇలా పైరసీ సినిమా ప్ర‌త్య‌క్షం కావ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. కొద్ది సేప‌టికే ఈ విష‌యం చిత్ర నిర్మాత జయంతిలాల్ గడకి చేరింది. వెంట‌నే ఆయ‌న చట్ట ప్రకారం సదరు బస్సు సంస్థపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సంఘ‌ట‌న‌పై బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కి చెందిన వారు ఫైర్ అవుతున్నారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!