సైన్యంలో ‘హిమాచల్ రెజిమెంట్’ ఏర్పాటు చేయాల్సిందిగా రక్షణమంత్రిని కోరిన జైరామ్ ఠాకూర్

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సోమవారం రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ను కలుసుకున్నారు. భారతీయ సైన్యంలో ‘హిమాచల్ రెజిమెంట్’ ఏర్పాటుకు ఆమెను కోరారు. అంతేకాకుండా  రక్షణ ప్రయోజనాల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా విమానాశ్రయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలనీ కోరారు.  యొక్క వేగవంతమైన అభివృద్ధి కొరకు కూడా కోరారు. 

హిమాచల్ రెజిమెంట్ ఏర్పాటు గురించి వివరిస్తూ రాష్ట్రంలోని 1200 మందికి పైగా జవాన్ల అత్యుత్తమ త్యాగాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే నాలుగు పరమ వీర చక్ర అవార్డులతో సహా దాదాపు 1,100 పోలీస్ అవార్డులు హిమాచల్ ప్రదేశ్ సాధించిన విషయం గుర్తుచేశారు. అదే విధంగా సైన్యంలో హిమాచల్ ప్రదేశ్ రిక్రూట్మెంట్ కోటాను పెంచాలని కోరారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!