ఆరోజు రాత్రి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఏం జరిగింది?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ప్రభుత్వ అధికారిపై ఆప్ ఎమ్మెల్యేల వీరంగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
 
ఢిల్లీ ప్రభుత్వ ఛీఫ్ సెక్రెటరీ అన్షు ప్రకాశ్ మీద ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లాహ్ ఖాన్ దాడికి పాల్పడ్డారు. అదీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో, అతడి సమక్షంలోనే కావడం గమనార్హం. ఆ సమయంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా అక్కడే ఉన్నారు. ఈ దాడికి నిరసనగా ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేపట్టారు. ఈ ఉదంతంతో ఢిల్లీ ప్రభుత్వోద్యోగులు, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 
 
కేంద్ర హోంశాఖ కూడా జరిగిన ఘటనపై రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని ఆదేశించింది. అంతేకాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ దీనిపై విచారం వ్యక్తం చేశారు. 
 
అసలు ఏం జరిగింది?:
జరిగిన ఘటనపై ఢిల్లీ చీఫ్ సెక్రటరి అన్షు ప్రకాష్ వివరణ ఇచ్చారు. అసలేం జరిగింది అన్నది అతని మాటల్లోనే.. “సోమవారం అర్ధరాత్రి 11.30 సమయంలో అరవింద్ కేజ్రీవాల్ సలహాదారుడి నుండి ఫోన్ వచ్చింది. అత్యవసర సమావేశం ఉంది రావాలి అని పిలుపు. దీంతో అధికారిక వాహనంలో సీఎం నివాసానికి చేరుకున్నాను. ఆ సమయంలో 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. తనను సీఎం, డిప్యుటీ సీఎం కూర్చుని ఉన్న గదిలోకి తీసుకువెళ్లారు. నేను కూర్చోగానే నాకు ఇరువైపులా ఇద్దరు ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ప్రభుత్వం ఏర్పడి 3ఏళ్లు నిందుతున్న సందర్భంగా వార్షికోత్సవాల సందర్భంగా టీవీ ప్రచారానికి కావాల్సిన నిధులు విడుదలలో జాప్యం ఎందుకైందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిబంధనలను అనుసరించే అవి విడుదల చేయడం జరుగుతుందని సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ అంశంపై మాటలు నడుస్తుండగా ఒక ఎమ్మెల్యే గట్టిగా అరుస్తూ, టీవీ ప్రచార నిధులు విడుదల చేసేదాకా గదిలో పెట్టి బంధిస్తామని హెచ్చరించాడు. తనపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తానని అన్నాడు.  ఈలోగా అమనతుల్లాహ్ ఖాన్ మరియు ప్రకాష్ జర్వాల్ ఇద్దరూ వచ్చి అకారణంగా దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా అదే భవనంలో ఉన్నారు” అని చీఫ్ సెక్రెటరీ వివరించారు. తాను అతి కష్టం మీద అక్కడి నుండి బయటపడ్డాను అని అన్షు ప్రకాష్ తెలిపారు. 
 
 
source: www.pgurus.com

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!