ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించిన జార్ఖండ్ 

జార్ఖండ్ ప్రభుత్వం ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థతో అంతర్గతంగా ఉన్న సంబంధాలు కారణంగా నిషేధం విధించినట్టు అధికారికంగా ప్రకటించింది. 
 
కేరళ రాష్ట్రంలో ఏర్పాటైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థపై మొదటి నుండీ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కేరళ నుండి ఇస్లామిక్ స్టేట్ రిక్రూట్మెంట్ల కోసం పీఎఫ్ఐ పనిచేస్తోందన్నది ప్రధాన అభియోగం. కేరళలో జరుగుతున్న హిందూ కార్యకర్తల వరుస హత్యల వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హస్తం ఉందని బలమైన ఆరోపణలు ఉన్నాయి. 
 
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తన కార్యకలాపాలు జార్ఖండ్ రాష్ట్రంలోనూ విస్తరించేందుకు ప్రయతించింది. పాకుర్ జిల్లాలో “స్కూల్ ఛలో” పేరిట పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. 
 
ఈక్రమంలో అనేక ఇంటెలిజెన్స్ నివేదికలు పరిశీలించిన అనంతరం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తెలిపారు.
 
Related News:

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!