ఒడిషా ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా… ఏం జరిగిందో చూడండి 

భువనేశ్వర్: ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి చెప్పులు విసిరాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి బార్‌ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. బేజీపూర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక నేపథ్యంలో కుంభారి గ్రామంలో నిర్వహించిన మీటింగ్‌లో నవీన్ పట్నాయక్ ప్రసంగిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి చెప్పులతో దాడి చేశాడు. చెప్పుల దాడి నుంచి సీఎంను సెక్యూరిటీ సిబ్బంది కాపాడారు. అప్రమత్తమైన ఇతర నేతలు, కార్యకర్తలు.. చెప్పులతో దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!