BREAKING: ఇకపై అయోధ్య రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతోందో తెలుసా?

అయోధ్య రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మహత్తరమైన నిర్ణయం తీసుకోబోతోంది. కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. అయోధ్య రైల్వే స్టేషన్ శ్రీరామ భవ్యమందిరం నమూనాలో తీర్చిదిద్దే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ కి పంపిస్తున్నామని తెలిపారు. కేంద్ర కేబినెట్ తమ ప్రతిపాదన ఆమోదిస్తే రామాజన్మభూమిలో నిర్మించేందుకు విశ్వహిందూ పరిషత్ రూపొందించిన భవ్యమందిరం నమూనాలోనే రైల్వే స్టేషన్ కూడా పునర్నిర్మిస్తామని తెలిపారు. 
 
అయోధ్యలో రైల్వే అభివృద్ధి నిమిత్తం సుమారు 200 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 80 కోట్లు అయోధ్య రైల్వే స్టేషన్ సుందరీకరణ కోసం వెచ్చించనున్నారు. ఇది 2021 సంవత్సరం నాటికల్లా పూర్తవుతుందని అంచనా. 
 
 
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యకు వెళ్లే యాత్రికులు, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!