అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ను చీల్చి చెండాడిన భారత్ 

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ఎదుట పాకిస్థాన్‌పై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. ‘టెర్రరిస్థాన్‌’, ‘ది ఐవీ లీగ్‌ ఆఫ్ టెర్రరిజమ్‌’ ఇలా రకరకాల పేర్లతో .. సరిహద్దు చొరబాట్లు ప్రోత్సహిస్తూ, ఉగ్రకార్యకలాపాలకు స్వర్గథామంగా ఉన్న పాక్‌, తన వైఖరి మార్చుకోవడం లేదంటూ గురువారం యూన్‌హెచ్‌ఆర్‌సీ ఎదుట తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలకు భారత్ పాల్పడుతోందంటూ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ స్పందిస్తూ.. పాక్‌ను ‘స్పెషల్‌ టెర్రరిస్ట్ జోన్‌’ అంటూ దుయ్యబట్టింది.

సాధారణంగా మనదేశంలో ‘స్పెషల్ ఎకనమిక్‌ జోన్‌’ అనే పదం వాడుకలో ఉంది. వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి కొంత ప్రాంతాన్ని ఎంపిక చేసి దానిలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తారు. దీనిలో అమలయ్యే ఆర్థిక నిబంధనలు మిగతా దేశంతో పోల్చుకుంటే వేరుగా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని స్పెషల్ ఎకనమిక్‌ జోన్ ‌అంటారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌ ఇస్తోన్న సహకారాన్ని భారత్‌ గురువారం ఐక్యరాజ్యసమితిలో తీవ్రంగా విమర్శించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి ప్రత్యేక సహకారం అందిస్తోందంటూ ఆ దేశం ‘స్పెషల్ టెర్రరిస్ట్ జోన్‌’ అంటూ భారత్ సంబోధించింది. సరిహద్దు చొరబాట్లు, ప్రత్యేక ఉగ్రవాద ప్రాంతాలు, ఉగ్రవాదులకు నిధులు అందించడం వంటి చర్యలను ‌ నిలిపివేసేలా యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌(యూన్‌హెచ్‌ఆర్‌సీ) పిలుపునివ్వాలని భారత్ కోరింది.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!