టీఆరెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు 

తెరాస రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, బండప్రకాశ్‌ ముదిరాజ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు.  వీరు రేపు నామినేషన్లు వేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశంలో నేతలతో చర్చించి వీరి పేర్లను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు.  రాజ్యసభకు తెలంగాణలోని మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు స్థానాలను సునాయాసంగా గెలుస్తామన్న నమ్మకం ఉన్న కేసీఆర్‌ వివిధ సమీకరణల కింద మూడు వేర్వేరు వర్గాలకు టికెట్లు ఇచ్చారు. శాసనసభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!