ఐక్యరాజ్య సమితి మానవహక్కుల శాఖ కాశ్మీరీ పండిట్లగురించి ఎందుకు పట్టించుకోవడంలేదు?

ఐక్యరాజ్య సమితి మానవహక్కుల శాఖ తమను, తమ గోడును పట్టించుకోవడంలేదని, కాశ్మీర్ నుండి మత ప్రాతిపదికమీద తరిమివేయబడ్డ కాశ్మీరీపండిట్లు ఆవేదన వ్యక్తం చేసారు. కాశ్మీర్లో పాకిస్తాన్ ద్వారా ప్రేరేపించబడ్డ టెర్రరిజం వల్ల 3,50,000 పైగా కాశ్మీరీ పండిట్ లు కాశ్మీర్ నుండి తరిమివేయబడ్డారని పేర్కొన్నారు.

ఐక్యరాజ్య సమితి శాఖ కేవలం ఒక మతానికి చెందిన వారికే సహాయం చేస్తోందని, పండిట్ల పై పక్షపాత ద్రుష్టి తో వ్యవహరిస్తోందని, గత 28 సంవత్సరాలలో పండిట్ల పైన జరిగిన దురంతాలను అసలు తెలియనట్లు వ్యవహరిస్తోందని తెలిపారు.

UNHCHR హై కమీషనర్ జాయిద్ రాద్ అల్ హుస్సేన్ కాశ్మీరీ పండిట్ల పైన జరిగిన దాడులపైన, వారి స్థితి పైన మౌనం వహిస్తున్నారని, ఇది బాధితులను మరింత బాధిస్తోందని పండిట్ల కమ్యూనిటీ లీడర్ అశ్విని చురుంగు పేర్కొన్నారు. ఐక్య రాజ్య సమితి లో పాకిస్తాన్ కు భారత్ గట్టి సమాధానమే ఇచ్చిందని కితాబిచ్చ్చారు.

కాశ్మీర్లో ఉన్న హిందూ ఆలయాలను, మరియు కొన్ని వేల సంవత్సరాల సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కాశ్మీర్లోని హిందువులదే కాక మొత్తం భారత దేశంలో ఉన్న హిందువులది కూడా అని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి మానవహక్కులు కూడా మత ఆధారితమైనవే అన్న అనుమానం పలుచోట్ల వ్యక్తమవుతోంది. ఇలా మత పరమైన అజెండాలతో కేవలం ఒక మతం వారికే తమ మద్దతు తెలపడం వల్ల , జరిగిన అన్యాయాలను అసలు పట్టించుకోకపోవడం వల్ల ఐక్యరాజ్య సమితి ప్రజలలో తన విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉన్నది.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!